ఛాలెంజింగ్‌ రోల్‌లో మిల్కీబ్యూటీ.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌ తారగా ఓ వెలుగు వెలిగింది. వెలుగుతూనే ఉంది. రీసెంట్‌గా స్టార్‌ హీరో వెంకీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. అవునండీ మిల్కీబ్యూటీ తమన్నా గురించే మనం మాట్లాడుకుంటున్నాం. పదేళ్లకు పైగానే కెరీర్‌ ఉన్న తమన్నా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళుతుండడం విశేషం. తొలిసారి వెంకీతో జత కట్టిన సినిమా 'ఎఫ్‌ 2' సంచనల విజయం అందుకుంది. వరుసగా ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ఇదిలా ఉంటే, తమన్నా చేతిలో ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టులు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున, సమంత కీలక పాత్రల్లో నటించిన 'రాజుగారి గది 2'కి సీక్వెల్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ సారి దెయ్యం పాత్రలో తమన్నా నటించబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా తమన్నా పేరు ఈ సినిమా కోసం ఖరారైందనీ సమాచారమ్‌. పూర్తి స్థాయి హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీగా ఈ సినిమా స్టోరీని ప్రిపేర్‌ చేశారట డైరెక్టర్‌ ఓంకార్‌. 

 

ఈ సంగతి అటుంచితే తమిళంలో ఆల్రెడీ 'దేవి 2' సినిమాలో దెయ్యం పాత్రలో నటించింది తమన్నా, అతి త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. దీంతో పాటు తమన్నా మరో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసిందనీ తెలుస్తోంది. తమిళ హీరో విశాల్‌ నటిస్తున్న ఓ చిత్రంలో ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం తమన్నాని ఎంచుకున్నారట. పూర్తి స్థాయి నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రట అది. నటిగా తనకి ఛాలెంజ్‌ విసిరే క్యారెక్టర్‌ అనీ, ఇలాంటి పాత్ర కోసం ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాననీ, ఖచ్చితంగా తానేంటో ప్రూవ్‌ చేసుకుంటాననీ మిల్కీబ్యూటీ చెబుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS