ఇప్పుడు దేశ వ్యాప్తంగా యువతకు, పిల్లలకు ఓ వ్యసనంలా మారిన ఆన్‌లైన్ గేమ్ 'పబ్‌జీ'. ఈ పేరు వినగానే పిల్లలూ, యూత్ ఊగిపోతున్నారు. పబ్‌జీ పాట్నర్స్‌ని తప్ప స్కూల్లో పిల్లలు ఇతరుల్ని తమ ఫ్రెండ్స్‌గా కూడా అంగీకరించడం లేదు. ఈ మహమ్మారి కారణంగా ఎన్ని ప్రాణాలు బలైపోయాయో ఈ మధ్య వార్తల్లో వింటూనే ఉన్నాం. 'పబ్‌జీ (ప్లేయర్ అన్‌నోన్ బాటిల్ గ్రౌండ్)' అనే పేరు వింటేనే పేరెంట్స్ భయపడిపోతున్నారు. ఈ గేమ్‌లో విజేతలైన వారికి 'పబ్‌జీ విన్నర్ చికెన్ డిన్నర్' అనే టైటిల్ వస్తోందట.
ఇదేదో ఆస్కార్ టైటిల్‌లాగా దీన్ని అందుకోవడానికి పిల్లలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గేమ్‌ని బేస్ చేసుకుని టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్ తన తాజా సినిమా 'అర్జున్ సురవరం'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇటీవల సినిమా ప్రమోషన్‌లో భాగంగా సెపరేట్‌గా ఓ రూమ్‌ని క్రియేట్ చేసి, అక్కడ అభిమానులతో గేమ్ ఆడిన విషయం ట్విట్టర్‌లో షేర్ చేశాడు నిఖిల్. తాజాగా ఈ మేరకు ఇంకో పోస్ట్ పెట్టాడు నిఖిల్. పబ్‌జీ అంటే తెలియని శత్రువులతో పోరాటం చేసి, గన్నులతో వారిని షూట్ చేసి చివరికి విన్నర్ కావాలి. అయితే నిఖిల్ మాత్రం ఒక్కరిని కూడా చంపకుండానే సోలో గేమ్‌లో చికెన్ డిన్నర్ కొట్టేశాడట.
అదే తన లేటెస్ట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు నిఖిల్. గేమ్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఆటని నిఖిల్ వంటి సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ఏమీ బాగోలేదని కొందరు నెటిజన్లు గుస్సా అవుతున్నారు. వీలైతే ఇలాంటి గేమ్స్ ఎంత ప్రమాదకరమో అవగాహన కల్పించాలి కానీ, యువత భవిష్యత్తును హరించేస్తున్న ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ని ఎంకరేజ్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికే నేపాల్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో 'పబ్‌జీ'ని బ్యాన్ చేశారు. మరి కొన్ని దేశాలు పబ్‌జీని బ్యాన్ చేసేందుకు చర్చోపచర్చలు జరుపుతున్నాయి.