మెగాస్టార్ చిరంజీవితో సహా సీనియర్ హీరోలంతా ఫుల్ ఛార్జ్‌లో ఉన్న తరుణంలో వీరికి హీరోయిన్స్‌ని వెతికి పెట్టడం పెద్ద తలనొప్పిగా మారింది దర్శక, నిర్మాతలకు. కొత్త భామలతో అలా అలా పని కానిచ్చేస్తున్నా, సినిమాకి వెయిట్ తగ్గిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హీరో స్టార్‌డమ్‌కి తగ్గ రేంజ్ హీరోయిన్ ఉంటేనే, ఆ సినిమాకి వెయిట్ కరెక్ట్‌గా ఉంటుంది. అలాంటిది హీరోయిన్ లో స్టార్‌డమ్ సినిమా స్థాయిని తగ్గించేస్తుండడంతో, స్టార్ హీరోలు ముఖ్యంగా సీనియర్ హీరోలు హీరోయిన్స్ ఎంపికపై జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు.
ఆ క్రమంలో మెగాస్టార్ సరసన త్రిషను, వెంకీ సరసన ప్రియమణిని ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబో మూవీ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఇంతవరకూ కేథరీన్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, అస్సలు ఫామ్‌లో లేని కేథరీన్‌ని తీసుకుంటే, సినిమాకి ఎంతమాత్రం వెయిట్ ఉంటుంది? అనే ఆలోచనలో పడిందట చిత్ర యూనిట్. అభిమానుల నుండి కూడా ఇదే అనుమానం వ్యక్తమవుతోందట. పోనీ బాలీవుడ్ భామల్ని పరిశీలిద్దామా? అంటే, బాలీవుడ్ నుండి సీనియర్ భామలెవరూ టాలీవుడ్‌పై ఆసక్తి చూపించడం లేదు.
ఇంతకీ బాలయ్యతో జోడీ కట్టబోయే ముద్దుగుమ్మ ఎవరో కానీ, దొరికిన ఒక్క హీరోయిన్ కేథరీన్‌పై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్యతో సినిమాకి కేథరీన్ నో చెప్పిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరు, వెంకీ ఎలాగో ఫిక్సయ్యారు కానీ, బాలయ్య పరిస్థితే ఇలా తయారైంది. నిజంగానే బాలయ్యకి హీరోయిన్ దొరకడం కష్టమైందా.?