గ్లామ్‌షాట్‌: యమ్మీ యమ్మీ 'పెళ్లికూతురు' ఇంత హాట్‌గానా.!

By iQlikMovies - November 27, 2018 - 09:49 AM IST

మరిన్ని వార్తలు

గ్లామ్‌షాట్‌:


పెళ్లికూతురు గెటప్‌ అంటే ట్రెడిషనల్‌గా ఉండాలని కోరుకుంటారు. ఎవరి ట్రెడిషన్‌కి తగ్గట్లు వారి వారి పెళ్లి మేకప్‌ ఉంటుంది. అయితే లేటెస్టుగా ఓ మ్యాగ్జైన్‌ కోసం పెళ్లికూతురు గెటప్‌లో ఇదిగో ఇంత హాట్‌గా హొయలు పోయిన ఈ ముద్దుగుమ్మని చూశారా.? యామీ గౌతమ్‌. 'కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌' సినిమాలో నితిన్‌కి జోడీగా నటించింది. 

 

బాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాపులర్‌ ఈ ముద్దుగుమ్మ. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ తన హాట్‌ అప్పీల్‌ని బయటికి తీసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంటుంది. సినిమాలోనూ ఈ బ్యూటీ హాటేలెండి. అయితే తాజాగా బ్రైడల్‌ వేర్‌లో ఈ హాట్‌ బ్యూటీ ఇచ్చిన పోజు ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

 

ముక్కుకు ఓ భారీ ముక్కుపుడక, మెడలో నిండైన ఆభరణంతో పాటు పింక్‌ కలర్‌ హాటీ కాస్ట్యూమ్‌లో అమ్మడిని చూస్తే ఆహా స్వీట్‌ అండ్‌ హాట్‌ బ్రైడల్‌ వేర్‌ అనుకోవడమే కాదు, ఈ క్షణమే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కెమెరాకి ఆమె ఇచ్చిన హాట్‌ పోజుకు కుర్రకారు గుండెలు జారి గల్లంతయ్యిపోతున్నారంతే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS