ఎమోషనల్‌గా దోచేస్తానంటోన్న 'దొంగ'.!

By Inkmantra - December 16, 2019 - 11:02 AM IST

మరిన్ని వార్తలు

'ఊపిరి' సినిమాతో స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన తమిళ హీరో కార్తి. ఇటీవలే 'ఖైదీ' సినిమాతో డబ్బింగ్‌ మూవీ అయినా సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇక ఇప్పుడు 'దొంగ' అంటూ అక్కా, తమ్ముడి సెంటిమెంట్‌తో కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజు 'రూలర్‌', 'ప్రతిరోజూ పండగే' సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయి. అయినా, తన సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఏమాత్రం భయమూ, బెరుకూ లేకుండా కార్తి తన సినిమాని బరిలోకి దించుతున్నాడు. ఈ సినిమాలో అక్క పాత్ర పోషిస్తున్న జ్యోతికకూ, తనకూ మధ్య వచ్చే సీన్స్‌లోని ఎమోషన్‌, 'ఊపిరి' సినిమాలోని నాగార్జున కాంబో సీన్స్‌లా ఉంటాయని కార్తి చెబుతున్నాడు. ఆ సినిమాలోని ఆ సీన్స్‌కి ఆడియన్స్‌ ఎలా కనెక్ట్‌ అయ్యారో, అంతకన్నా ఎక్కువగా ఈ సినిమాకి కనెక్ట్‌ అవుతారని కార్తి అంటున్నాడు. ఈ సీజన్‌లో వచ్చిన 'ఖైదీ'ని మించిన హిట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. జీతూ జోసెఫ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS