ఆ రీమేక్‌తో చైతూ రిస్క్‌ చేస్తున్నాడా?

మరిన్ని వార్తలు

'మజిలీ' హిట్‌ నాగచైతన్యలో ఎక్కడ లేని ఉత్సాహాన్ని పెంచింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టేస్తున్నాడు చైతూ. ఆల్రెడీ వెంకటేష్‌తో 'వెంకీ మామ' సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ మధ్యనే శేఖర్‌ కమ్ములతో ఓ క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, పట్టాలెక్కించేయడం రెండూ జరిగిపోయాయి. తాజాగా చైతూ మరో కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడని తెలుస్తోంది.

 

బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ అయిన 'బదాయి హో' సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు దిల్‌రాజు రెడీ అవుతున్నారట. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌తో ఈ సినిమాని తెలుగులో నిర్మించేందుకు రాజుగారు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాని తెలుగులో చైతూ హీరోగా రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట దిల్‌ రాజు. ఈ రీమేక్‌లో నటించేందుకు చైతూ కూడా ఇష్టంగానే ఉన్నాడనీ తెలుస్తోంది. బాగానే ఉంది. కానీ, 'బదాయి హో' ఓ క్రిటికల్‌ కామెడీ సబ్జెక్ట్‌. బాలీవుడ్‌లో వర్కవుట్‌ అయ్యింది.

 

టాలీవుడ్‌కి ఎక్కుతుందా? గతంలో కొంచెం అటూ ఇటూగా ఉన్న ఈ తరహా సబ్జెక్ట్‌ 'విక్కీ డోనర్‌' కాన్సెప్ట్‌ని తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో అక్కినేని హీరో సుమంత్‌ హీరోగా రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. కానీ, బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయింది. ఇక 'బదాయి హో' విషయానికి వస్తే, 25 ఏళ్ల కొడుకున్న తల్లి, ప్రెగ్నెంట్‌ అయితే ఎలా ఉంటుంది.? అనే సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. ఒకవేళ ఈ రీమేక్‌లో చైతూ నటించేంది నిజమే అయితే, అది చైతూకి కలిసొస్తుందా.? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS