సల్మాన్‌ సినిమాకి వివాదాల అడ్డంకి!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'దబాంగ్‌ 3' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ జోరుగా నిర్వహిస్తోంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతుండడంతో, యూనిక్‌గా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. మొన్న చెన్నైలో సందడి చేసిన సల్మాన్‌ ఖాన్‌, లేటెస్ట్‌గా హైద్రాబాద్‌లోనూ సందడి చేశారు. సల్మాన్‌ ఖాన్‌తో పాటు, చరణ్‌, వెంకటేష్‌ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేశారు. స్టేజ్‌పై సల్మాన్‌తో కలిసి చరణ్‌, వెంకటేష్‌ జోరుగా స్టెప్పులేసి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించారు.

సుదీప్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించగా, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సోనాక్షి సిన్హా హీరోయిన్‌ కాగా, హాట్‌ బ్యూటీ మౌనీరాయ్‌ స్పెషల్‌ రోల్‌లో తళుక్కున మెరిసింది. ఇదంతా బాగానే ఉంది. కానీ, రిలీజ్‌కి దగ్గరైన ఈ సినిమాని ఓ వివాదం చుట్టుముట్టింది. ఈ సినిమాలోని ఓ పాటలో కొన్ని సన్నివేశాలు సాధువుల్ని కించపరిచేలా ఉన్నాయంటూ, హిందూ జాగృతి సంస్థ ముంబై సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ అభ్యంతరకర సన్నివేశాల్ని తొలిగించాలనీ లేదంటే, సినిమా విడుదలను అడ్డుకుంటామనీ వారు హెచ్చరిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Dabangg3

A post shared by Salman Khan Films (@skfilmsofficial) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS