హిప్పీ అంటే సంచార జీవి. ఈ సినిమాలో హీరో ప్రేమ సంచార జీవి.. అనే మీనింగ్స్ మాట్లాడుకున్నారింతవరకూ. అయితే, 'హిప్పీ'కి బట్టలిప్పేసి కొత్త మీనింగ్స్ చెప్పేస్తున్నారు వీరు. నిజంగా నిజమండీ బాబూ. హిప్పీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో కార్తికేయ చొక్కా విప్పేస్తే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ హీరో జె.డీ చక్రవర్తి ఏకంగా ప్యాంటే విప్పేశారు. అండర్ వేర్‌తో అక్కడి నుండి నడుచుకు వెళ్లారు. ఇదేం గోలబ్బా.. అని అది చూసిన ఛానెల్ వాళ్లు విస్తుపోయారు. ఆడియన్స్ కూడా ఆడి పోసుకుంటున్నారు వీరిద్దరి వింత వైఖరికి. కార్తికేయ ఓకే. ఏదో సిక్స్‌ప్యాక్ ఉంది. కుర్రోడు. షర్టు విప్పాడు.
పెద్దగా వల్గర్ అనిపించలేదు. కానీ, సీనియర్ నటుడు జెడీకేమైంది? ఏకంగా ప్యాంటు విప్పేసి పబ్లిగ్గా ఆ పోజులేంటీ.? అంటూ ఆడియన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఎంత సినిమా విడుదల దగ్గరపడితే మాత్రం, ప్రమోషన్స్ మరీ ఇంత వింతగా చేయాలా? రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాపై పెద్దగా బజ్ లేదు కానీ, అమ్మాయిల గ్లామర్, లిప్‌లాక్ సీన్స్‌తో యూత్ కంటెంట్ మూవీ అని బాగానే ప్రొజెక్ట్ చేశారు. అయితే, పబ్లిసిటీలో ఈ వింత ధోరణి మాత్రం కొంత తప్పు దోవ పట్టిస్తోంది. ఏదేమైతేనేం. ఇక కొన్ని గంటల్లో సినిమా రిజల్ట్ తేలిపోనుంది. దాన్ని బట్టి, కార్తికేయ, జె.డి చక్రవర్తి చేసింది ఏ టైప్ ఆఫ్ పబ్లిసిటీ అనేది సింపుల్‌గా తేల్చేస్తారు ఆడియన్స్. లెట్స్ వెయిట్ అండ్ సీ!