గ్లామర్‌లో ఎన్ని వయ్యారాలు పోవాలో షెర్లీన్ చోప్రాకు తెలిసినంతగా మరే భామకీ తెలియదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఏదో ఒక గ్లామర్ పబ్లిసిటీ చేసి, వివాదాల్లో నిలవాలనుకుంటుంది ఎప్పుడూ షెర్లీన్ చోప్రా. మొన్నామధ్య వుమెన్స్ డే సందర్భంగా అమ్మడు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో, ఎన్ని వివాదాలను లేవనెత్తిందో తెలిసిన సంగతే. అమ్మడి శృతిమించిన అతి గ్లామర్‌తో పవిత్రమైన వుమెన్స్డేని అపవిత్రం చేసిందంటూ నెటిజన్లు గుమ్మెత్తిపోశారు.
తాజాగా 'బేబీబాస్' ట్యాగ్‌లైన్‌తో స్టైల్‌గా ఇంకో ఫోటో వదిలింది. బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్ ప్యాంట్లో, అన్ జిప్ప్డ్ టాప్‌లో షెర్లీన్ ఇచ్చిన పోజు ఆమె అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నా, ఎప్పటిలాగే విమర్శలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కూర్చున్న తీరును తప్పు పడుతూ కొందరు ట్రాల్ చేస్తున్నారు. కానీ ఇలాంటి విమర్శలు ఈ హాట్ బ్యూటీకేం కొత్త కాదు కదా. ఎప్పటిలాగే లైట్ తీసుకుంది. ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తోంది.
ALSO SEE : sherlyn chopra latest photoshoot