'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.. ' అంటూ ఓ హీరో పాటేసుకున్నాడు. కానీ ఈ హీరోయిన్ మాత్రం అదే పని చేస్తానంటోంది. చూస్తున్నారుగా పిక్. దిశా పటానీ చురకత్తుల్లాంటి చూపుల్తో చంపేసేలా ఎలా చూస్తోందో. ఇండోర్ ఫోటో షూట్లో భాగంగా దిశా పటానీ ఇదిగో ఇలా పోజిచ్చింది. నల్లని కాజల్ కళ్లతో ఈ ముద్దుగుమ్మ అలా చూపులు విసిరేస్తే కుర్రకారు ఏమైపోవాలి.? ఎక్కువగా ఇన్నర్ వేర్స్‌లో, బికినీలలో దర్శనమిచ్చే దిశాపటానీ, గోల్డెన్ లాంగ్ ఫ్రాక్‌లో హాట్ హాట్‌గా క్లీవేజ్ షో చేసేస్తూ కెవ్వుకేక పుట్టించింది ఈ ఫోటోలో.
ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ, దిశా పటానీ ఏ దిశలో చూసినా అందమే. చూపు తిప్పుకోనీయదసలే. గోల్డెన్ కలర్ డ్రస్సుకు మ్యాచింగ్ అయ్యేలా గోల్డెన్ షూ, ఒక సైడ్‌గా వదిలేసిన లూజ్ హెయిర్ ఆమె అందాన్ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. వాల్ పెయింటింగ్, బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించిన దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.