దిశా పటానీ ఆలా ఫిక్సవ్వాల్సిందేనా..!

మరిన్ని వార్తలు

'లోఫర్‌' సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ దిశాపటానీ తొలి అడుగులోనే ఫెయిల్యూర్‌ చవి చూసింది. అయితే ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో అమ్మడికి బోలెడంత ఫ్యాన్‌ బేస్‌ ఉంది. కాల్విన్‌ క్లెయిన్‌ ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దిశా పటానీ ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు, ఇక ఇప్పుడు సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌తో పాటు, బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక చిత్రాలతోనూ దూసుకెళ్తోంది అందాల దిశా. 

 

సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్‌' సినిమాలో దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిశాపటానీ, సల్మాన్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం లేదట ఈ సినిమాలో. సల్మాన్‌కి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తుండగా, సల్మాన్‌కి చెల్లెలి పాత్రలో దిశా పటానీ నటిస్తోంది. చెల్లి పాత్రకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఆ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే దిశా కనిపించనుంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌తోనూ దిశా పటానీ ఓ సినిమాలో నటిస్తోంది. 

 

మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'బాఘీ 3'లోనూ దిశా పటానీ పేరు పరిశీలనలో ఉంది. ఆల్రెడీ ఈ సినిమా కోసం శ్రద్ధాకపూర్‌ పేరు కన్‌ఫామ్‌ కాగా ఇంకో పాత్ర కోసం దిశా పటానీని పరిశీలిస్తున్నారట. 'బాఘీ 2'లో దిశాపటానీ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఎట్నుంచి ఎటు చూసినా దిశా పటానీకి సెకండ్‌ హీరోయిన్‌ ఛాన్సే దక్కుతోంది కానీ, నటిగా అసలు సిసలు సత్తా చూపించే బంపర్‌ ఛాన్స్‌ మాత్రం ఎప్పుడు వరిస్తుందో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS