అటు సంసారం.. ఇటు సినిమా.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తోంది సమంత. ఈ వేసవి తను ఫుల్ బిజీ. తమిళంలో 'సూపర్ డీలక్స్' అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సమంత నటనకూ మంచి పేరొచ్చింది. ఇప్పుడు 'మజిలీ' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'ఓ బేబీ' కూడా షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు `96` రీమేక్ పనులు ఊపందుకున్నాయి.
'96' మినహాయిస్తే... సమంత ఒప్పుకున్న సినిమాలేవీ లేవు. కొన్ని ప్రతిపాదనలు వచ్చినా, ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ప్రస్తుతం సమంత హాలీడే మూడ్‌లో ఉందని, మజిలీ విడుదలైన తరవాత.. కొన్ని రోజుల పాటు విహార యాత్రలకు వెళ్లబోతోందని టాక్. తిరిగొచ్చాక 'ఓ బేబీ' షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ తరవాత ఇంకొన్నాళ్లు విశ్రాంతి తీసుకోనుంది.
'96' తరువాత మరే కొత్త సినిమానీ ఒప్పుకోకూడదని సమంత భావిస్తోందట. ఈ సమయాన్ని చైతన్యకే కేటాయించాలన్నది సమంత ప్లాన్. చైతూ కూడా 'వెంకీ మామ' మినహా మరే కథా వినలేదు. 'వెంకీ మామ' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'మజిలీ' విడుదలైన తరవాతే కొత్త కథలు వినాలని ఫిక్సయ్యాడట. మొత్తానికి ఈ జంట... కెరీర్‌ని ఆచి తూచి ముందుకు నడిపిస్తూనే - వ్యక్తిగత జీవితాన్నీ ఆస్వాదిస్తున్నారన్నమాట.