హాట్ హాట్ వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కించేసే ముద్దుగుమ్మ షెర్లీన్ చోప్రా కొత్త అవతారమెత్తింది. ర్యాపర్‌గా మారి, ఓన్‌గా ఓ ర్యాప్ ప్రిపేర్ చేసి నెట్టింట్లో వదిలింది. వుమెన్స్ డే సందర్భంగా ఈ ర్యాపర్‌ని వదిలినట్లు ఈ హాట్ బాంబ్ సెలవిచ్చింది. అయితే ఉమెన్స్ డే సందర్భంగా భారతనారీమణుల కోసం అంటూ, వదిలిన ఈ ర్యాప్ వీడియోలో అమ్మడి డ్రస్సింగ్‌కి నెటిజన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ పోటెత్తాయి.
భారత నారీమణులందరి సంగతి ఎందుకులేమ్మా.? నీ సంగతి నువ్వు చూసుకో.. అంటూ కొందరు నెటిజన్లు మండిపడగా, భారత నారీమణుల గురించి మాట్లాడే హక్కు, అధికారం నీకు లేదంటూ ఇంకొందరు గుస్సా అవుతున్నారు. అయితే ఈ వీడియోలో షెర్లీన్ చోప్రా డ్రస్సింగ్ సెన్స్, బాడీ లాంగ్వేజ్ కాస్త జుగుప్సాకరకంగానే ఉన్నాయి మరి.
పొట్టి జీన్స్ నిక్కరులో టాప్‌లో అదే పేటర్న్ కోటు వేసింది కానీ, ఓపెన్ చేసేసింది. ఇన్నర్ వేర్‌లో ఆమె ఎద భాగాన్ని భారతనారీమణులు సిగ్గుపడేలా ఎక్స్‌పోజ్ చేసింది. న్యూడ్ గెటప్‌లో కూడా దర్శనమిచ్చిన షెర్లీన్‌కి ఇదేమంత కొత్త విషయం కాకపోయినా, ఉమెన్స్‌డేని పురస్కరించుకుని ర్యాప్ చేశాననే బిల్డప్ ఇచ్చింది కాబట్టి, నెట్టింట్లో ఈ ట్రాలింగ్ తప్పడం లేదు షెర్లీన్ చోప్రాకి.
#HappyInternationalWomensDay #thinkequal #buildsmart #innovateforchange #balanceforbetter
— SHERLYN CHOPRA (@SherlynChopra) March 8, 2019
Rap written by @SherlynChopra pic.twitter.com/iZDXcwHSfp