హాట్‌ హాట్‌ సొగసుల సమంతని చూశారా.?

మరిన్ని వార్తలు

ఫ్రెష్‌ లుక్‌లో సమంతను చూస్తే షాకవ్వాల్సిందే. ఆ రేంజ్‌లో హాట్‌నెస్‌ ప్రదర్శించేసింది సమంత. ఈ ఏడాది 'మజిలీ', 'సూపర్‌ డీలక్స్‌' (డబ్బింగ్‌ మూవీ) సినిమాలతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న సమంతా ఈ లోగా ఫ్యాన్స్‌కి ఓ చిన్న షాక్‌ ఇచ్చింది. సినిమాల్లో గ్లామర్‌కి పెద్దగా చోటు లేకుండా, పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటోన్న సమంత. 

 

తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం రెచ్చిపోయి (అప్పుడప్పుడూ) ఎక్స్‌పోజింగ్‌ చేస్తుంటుంది. అలాంటివే తాజాగా కొన్ని హాట్‌ పిక్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పిక్స్‌కి నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయినా సమంతకిది అలవాటే. సమంత గ్లామర్‌ని ఆరాధించేందుకు ఎప్పుడూ సోషల్‌ మీడియాలో అభిమానులు సిద్దంగానే ఉంటారు. 

 

మెరూన్‌ కలర్‌ హాట్‌ అండ్‌ స్పైసీ అల్ట్రా మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో సమంత సొగసులు చూడతరమా అనే రేంజ్‌లో ఉన్నాయి. మెడలోని కంఠాభరణం సమంత అందానికి మరింత నిండుతనం తెచ్చింది. అస్సలేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పిక్‌పై ఓ లుక్కేసేస్కోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS