'అర్జున్‌రెడ్డి' సినిమాతో సంచలన స్టార్ అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడాడి తమ్ముడొస్తున్నాడు. తమ్ముడు కదా అని తక్కువంచనా వేస్తారేమో. అస్సలు కూడదు. అన్నను మించిన రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడీ యంగ్ హీరో. పేరు ఆల్రెడీ పరిచయమే ఆనంద్ దేవరకొండ. తెరంగేట్రం చేస్తున్న సినిమా 'దొరసాని'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. పాత్రలు, పాత్ర చిత్రీకరణలేమీ రివీల్ చేయలేదు కానీ, ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు. కె.వి.ఆర్ మహేంద్ర ఈ సినిమాకి దర్శకుడు.
అయితే అసలు మ్యాటరేంటంటే, 'అర్జున్‌రెడ్డి' సినిమా అంత సెన్సేషనల్ అవ్వడానికి అసలు సిసలు కారణం హీరో - హీరోయిన్ మధ్య గాఢమైన లిప్‌లాక్ సీన్స్. ఇప్పుడదే ఫార్ములా తమ్ముడు కూడా ఫాలో చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో యూత్‌ని సంకెళ్లతో కట్టిపాడేసే గాఢమైన లిప్‌లాక్ సీన్స్ ఉండబోతున్నాయంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. సినిమాకి అత్యంత కీ టైంలో ఈ లిప్‌లాక్ సీన్లు ఎంటర్ అవుతాయట.
మరి ఈ ఘాటు రొమాంటిక్ ఫార్ములాతో మనోడు కూడా అన్నలాగే సెన్సేషన్ అవుతాడా.? లేక అన్ననే మించిపోతాడా.? అనేది చూడాలిక. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ పేరు చెప్పలేదు కదా. శివాత్మిక. అవునండీ రాజశేఖర్ - జీవిత దంపతుల చిన్న కుమార్తై శివాత్మికనే. సిద్దాంతాలూ, చింతకాయాలూ.. అంటూ తెగ స్పీచ్లిచ్చేసే ఈ పేరెంట్స్ తొలి సినిమాకే కూతురు లిప్‌లాక్ అంటే ఒప్పుకున్నారా.? సిట్యువేషన్స్ డిమాండ్ చేశాయేమో.. నిదానంగా చూద్దాంలెండి.