ఈమధ్య పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌లో లింకు పెట్టుకున్న సినిమాలకైతే అస్సలు గ్యారెంటీ లేదు. `సైరా`కీ అలాంటి పరిస్థితే వచ్చింది. వీఎఫ్ఎక్స్ వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందేమో అనే సందేహం అటు చిరంజీవి అభిమానుల్లోనూ, ఇటు చిత్రసీమలోనూ కలుగుతోంది. పైగా రీషూట్ల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. నిజానికి 2019 వేసవిలోనే ఈ సినిమా విడుదల కావాల్సివుంది. కానీ.. కురద్లేదు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చరణ్ చెప్పాడు కూడా. కానీ.. ఆ అవకాశాలు కనిపించడం లేదని, ఈ సినిమా 2020 సంక్రాంతికి వాయిదా పడబోతోందని వార్తలొస్తున్నాయి.
రామ్ చరణ్ మాత్రం ఆరు నూరైనా సైరాని ఆగస్టులోనే విడుదల చేయాలని ఫిక్సయ్యాడట. ఏప్రిల్ నెలాఖరులోగా షూటింగ్ పూర్తి చేయాలని, మే నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టాడని చిత్రబృందానికి సూచించాడట. దానికి తగినట్టే.. షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయిందని, యుద్ద సన్నివేశాలకు సంబంధించిన సీజీ వర్క్ ఎప్పుడో పూర్తయిందని తెలుస్తోంది. చిత్రబృందం ఇదే కసితో కష్టపడితే.. సైరా ఆగస్టుకి రావడం ఖాయమే.