సితార విషయంలో మహేష్‌ ప్లాన్‌ అదేనా.?

By Inkmantra - March 31, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

గతంలో స్టార్‌ కిడ్స్‌ చాలా మంది చైల్డ్‌ ఆర్టిస్టులుగా సందడి చేసిన సందర్భాలున్నాయి. అయితే సినిమాల్లో నటించకుండానే ఈ రేంజ్‌లో ఇమేజ్‌ దక్కించుకోవడం మాత్రం సితార పాపకే చెల్లింది. ఇప్పుడీ పేరుకు పరిచయం అస్సలు అక్కర్లేదు. అంతలా మార్మోగిపోతోంది ఈ పేరు. సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవరాలు, మహేష్‌బాబు ముద్దుల కూతురు ఈ సితార. ఈ మధ్య సితార గురించి జరుగుతున్న చర్చ ఇంకే స్టార్‌ కిడ్‌ విషయంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. 

 

సితారకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో ముద్దు ముద్దుగా ఫ్యాన్స్‌కి షేర్‌ చేసి, సరికొత్త వినోదం పంచుతున్నాడు మహేష్‌బాబు. మొన్నా మధ్య సితార పాప ఎక్స్‌లెంట్‌ డ్యాన్సింగ్‌ వీడియో అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్‌ ఫోటోలు పోస్ట్‌ చేశాడు. లేటెస్ట్‌గా మహేష్‌ మైనపు బొమ్మ ఆవిష్కరణలో ఏఎంబీ ధియేటర్‌ వద్ద సితారే హైలైట్‌గా నిలిచింది. వెరీ లేటెస్ట్‌గా 'మహర్షి' ఆన్‌ లొకేషన్‌ ఫోటోలు కొన్ని పోస్ట్‌ చేసి, 'సితారతో చోటీ చోటీ బాతే.. మీటీ మీటీ యాదే..' అంటూ మురిసిపోతున్నాడు మహేష్‌. 

 

ఇంతలా కూతుర్ని మహేష్‌ ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నాడంటే.. మహేష్‌ మనసులోని ఆలోచన ఇదే అయ్యుంటుందని ఫ్యాన్స్‌ ఓ క్లారిటీకి వచ్చేశారు. కొడుకు గౌతమ్‌ని '1 - నేనొక్కడినే' సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసేశాడు. మహేష్‌ కూడా చైల్డ్‌ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కూతురు వంతొచ్చినట్లుంది. సితార తెరంగేట్రం త్వరలోనే ఉండబోతుంది కాబోలు. ఒకవేళ 'మహర్షి'లోనే సితార పాప ఎంట్రీ ఇచ్చేసిందేమో. ఆ విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారేమో. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS