రాజా నీకిది తగునా!

మరిన్ని వార్తలు

బహిరంగ వేదికలపై ప్లే బాక్‌ సింగర్స్‌ స్టేజ్‌ మీదికొచ్చి పలు చిత్రాలను తమ సుమధుర గానంతో ఆలపించడం పరిపాటి. అలాగే ప్రముఖ సింగర్‌ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ మధ్య బహిరంగ వేదికలపై ప్రఖ్యాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా గీతాలను ఆలపిస్తున్నారు. అయితే ఇలా చేయడం తగదనీ, ఇలా తన మ్యూజిక్‌లో తెరకెక్కిన ఈ గీతాలను ఆలపిస్తున్నందుకు తనకు రాయల్టీ చెల్లించాలని ఇళయరాజా, బాలుగారికి నోటీసులు పంంపించారు. తన మ్యూజిక్‌లో వచ్చిన పాటల్ని బాలు పాడొద్దంటూ ఆయనకు లీగల్‌ నోటీసులు అందించడం ఇళయారాజాకు ఎంతవరకూ సబబు. ఎందుకిలా ఆయన ప్రవర్తిస్తున్నారు. మ్యూజిక్‌కి ప్రాణం గాయకుని గాత్రమే. అలా ఎన్నో పాటలు ఇళయరాజా మ్యూజిక్‌కి బాలు గాన మాధుర్యం తోడవడం వల్లే సక్సెస్‌ అయ్యాయి. అలాంటిది ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది. బాలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి మిగిలిన గాయనీ గాయకులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దక్కాలని ఆశిస్తున్నారు. బాలు మాదిరిగానే పలు సింగర్స్‌ సునీత, నాగూర్‌ బాబు తదితరులు పలు బహిరంగ వేదికల్లో తమ గీతాలాపన చేస్తున్నారు. మరి ఇళయరాజా వేటు కేవలం బాలు మీదనేనా? లేక మిగిలిన గాయనీ గాయకులకు కూడా తగులుతుందా? ఓ కళాకారుడు మరో కళాకారుణ్ణి ఇలా కించపరచడం పట్ల పలు సినీ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితికి తెర పడేదెప్పుడో మరి తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS