సన్‌డే ఫన్‌డేలో భాగంగా, నాగార్జున మాస్క్‌లతో గేమ్ స్టార్ట్ చేశాడు. ఇంటి కెప్టెన్‌గా ఈ మాస్క్‌లు ఇవ్వాల్సిన బాధ్యత సావిత్రక్క అలియాస్ శివజ్యోతికి అప్పగించాడు. నక్క, సింహం, కుక్క, కోతి, ఎలుగుబంటి, కుందేలు.. ఇలా రకరకాల మాస్క్‌లు సిద్ధం చేశాడు. ఆ మాస్క్‌లు ఇంట్లో ఎవరెవరికి సూటవుతాయో, కారణంతో సహా చెప్పాలని శివజ్యోతికి సూచించాడు. అందులో భాగంగా, పునర్నవి - కుందేలు, బాబా భాస్కర్‌కి నక్క, ఊసరవెల్లి రెండు మాస్క్‌లు ఇచ్చి కారణాలు చెప్పింది శివజ్యోతి.
అలాగే అలీకి సింహం, ఆషూకి పాము.. మాస్క్‌లు పెట్టింది. ఇక చివరిగా మిగిలిపోయిన సోంబేరి బేర్ (ఎలుగుబంటి) మాస్క్‌ని వితికాకి పెట్టింది. ఎక్కువగా పని చేయకపోవడం, ఎవరు చెప్పిన మాటైనా తొందరగా వినేయడం, వారి వెంట వెళ్లిపోవడం వంటి ఆప్షన్స్ ఈ మాస్క్‌కున్న కారణంగా, అలాంటి క్యారెక్టర్ వితికనే అని ఆమెకే ఈ మాస్క్ ఇచ్చేసింది. అయితే, ఈ మాస్క్ తీసుకున్న వితిక కొంచెం అప్‌సెట్ అయినట్లుగా కనిపించింది. దాని పర్యవసానం ఎలా ఉండబోతుందో తర్వాతి ఎపిసోడ్స్‌లో తెలుస్తుందనుకోండి.
హౌస్‌లో ఎక్కువగా తినే క్యాండిడేట్‌గా హిమజకు ఏనుగు మాస్క్ ఇచ్చింది. బుద్దిమంతుడు, మొహమాటస్థుడు.. ఎప్పుడో జరిగిన విషయాన్ని తర తరాల తలచుకుని బాధపడే వ్యక్తి హౌస్‌లో రాహుల్ అంటూ ఆ ఆప్షన్స్ ఉన్న జింక మాస్క్‌ని రాహుల్‌కి పెట్టింది. ఇలా ఈ మాస్క్‌ల గేమ్ చాలా బాగుంది అని చెప్పలేం కానీ, ఓ మోస్తరు వినోదాన్ని పంచింది ఈ వారం బిగ్‌బాస్‌లో.