తెలుగు తెరపై అరివీర భయంకరుడు.!

మరిన్ని వార్తలు

భారతదేశం తరపున వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికపై మెరిసిన ది గ్రేట్‌ ఖలి గురించి తెలియని వారుండరు. ఇప్పుడీ అరివీర భయంకరుడు తెలుగు తెరపై తొలిసారిగా సందడి చేయబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు జయంత్‌.సి.పరాన్జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారా ఖలి తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో నీలేష్‌ యతి హీరోగా నటిస్తున్నాడు. ఖలి పేరు చెప్పగానే భయంకరమైన రూపం కనిపిస్తుంది. అతని హైటూ, వెయిటూ ఆ స్థాయిలో ఉంటాయి మరి. 

 

కండలు తిరిగిన శరీరం, భయపెట్టే రూపం ఇవన్నీ ఖలిని డబ్ల్యూ డబ్ల్యూఈ సూపర్‌స్టార్‌గా మార్చాయి. అయితే ఖలి నిజజీవితంలో చాలా సరదా మనిషి. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఈ రెజ్లింగ్‌ సూపర్‌స్టార్‌ ఇప్పటికే వెండితెరపై కనిపించాడు. అయితే అది తెలుగులో కాదు. మరోపక్క జయంత్‌ సినిమాకి 'నరేంద్ర' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఖలీలాగానే కండలు తిరిగిన దేహంతో నీలేష్‌ కనిపించబోతున్నాడు. 

 

ఇసాబెల్లే ఈ సినిమాలో నీలేష్‌తో జోడీ కడుతోంది. అఖిల్‌ తాజా సినిమా 'మిస్టర్‌ మజ్ను'లో ఇసా బెల్లే ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో నటించింది. ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన జయంత్‌ సి పరాన్జీ ఈ మధ్యన జోరు తగ్గించాడు. ఈ మధ్యనే ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడితో ఓ సినిమా రూపొందించారాయన. ఆ సినిమా పరాజయాన్ని చవి చూసింది. 'ప్రేమించుకుందాం రా' పరాన్జీకి తెలుగులో తొలి సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS