'ఇద్దరి లోకం ఒకటే' అంటోన్న యంగ్‌ హీరో.!

By Inkmantra - April 22, 2019 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

రాజ్‌ తరుణ్‌ తాజా చిత్రం టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. 'ఇద్దరి లోకం ఒకటే' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం లేటెస్ట్‌గా లాంఛ్‌ అయ్యింది. దిల్‌ రాజు బ్యానర్‌లో రాజ్‌తరుణ్‌ నటిస్తున్న చిత్రమిది. గతంలో దిల్‌రాజు బ్యానర్‌లో రాజ్‌తరుణ్‌ నటించిన చిత్రం ఆశించిన విజయం అందుకోలేదు. కానీ ఈ సారి విజయం పక్కా అంటున్నాడు. పక్కా ప్లానింగ్‌ స్క్రిప్టుతో రంగంలోకి దిగుతున్నాడట. జి.ఆర్‌.కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు. 

 

కాగా ఈ సినిమా టైటిల్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఈ జోనర్‌లో వచ్చిన టైటిల్‌ మూవీలు దాదాపు సక్సెస్‌ లిస్టులో ఉన్నవే అని చెప్పొచ్చు. సో టైటిల్‌ పరంగా రాజ్‌తరుణ్‌కిది కలిసొచ్చే అంశమే. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో ఎంట్రీ ఇచ్చి సంచలన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయాలతో డబుల్‌ హ్యాట్రిక్‌ హీరోగా పాపులర్‌ అయ్యాడు. అయితే ఈ మధ్య రాజ్‌తరుణ్‌ నటించిన సినిమాలేమీ బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా నిలదొక్కుకోలేకపోతున్నాయి. 

 

దాంతో కూసింత గ్యాప్‌ తీసుకున్నాడు రాజ్‌తరుణ్‌. రీఫ్రెష్‌ అయ్యి వస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. కూల్‌ రొమాంటిక్‌ మెలోడియస్‌ మూవీ అని తెలుస్తోంది. టైటిల్‌ పరంగా చూస్తే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కూడా అత్యంత కీలకమని తెలుస్తోంది. కానీ ఇంకా హీరోయిన్‌ ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS