బిగ్ బాస్ చుట్టూ వివాదాలు పేరుకుపోతున్న ఈ తరుణంలో నిర్వాహకులు వెనుకడుగు వేశారా? ఈ షోని వాయిదా వేయాలనుకుంటున్నారా? ఆ అవకాశాలున్నాయని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బిగ్ బాస్ పేరుతో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొంతమంది హై కోర్టుని కూడా ఆశ్రయించారు. ఈరోజు నాగార్జున ఇంటి ముందు నిరసన కారులు ఆందోళన చేపట్టారు. ఆరోపణలకు సమాధానం చెప్పిన తరవాతే... ఈ షో మొదలెట్టాలని, లేదంటే.. ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ షో విషయంలో నాగార్జున కూడా పునరాలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. ఈ షో హోస్టింగ్ నుంచి తప్పుకోవాలని నాగ్ భావిస్తున్నారని సమాచారం. రేపు (ఆదివారం) బిగ్ బాస్ 3 సీజన్‌కి కర్టైజ్ రైజర్ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పటికే తెరకెక్కించి ఉంటారని తెలుస్తోంది. అయితే.. ఈ షోని వాయిదా వేసి, ఆందోళనలు సద్దుమణిగాక మొదలెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నార్ట. ఒకవేళ నాగార్జున ఈ షో నుంచి తప్పుకుంటే.. మరో హోస్ట్‌ని వెదికి పట్టుకొనేంత వరకూ.. బిగ్ బాస్ 3కి పుల్ స్టాప్ పడినట్టే.