ఇటీవల విడుదలైన.. శ్రీకారం మంచి టాక్ సంపాదించుకుంది. అయితే.. ఈ సినిమా మహేష్ బాబు - మహర్షిని పోలి ఉందని నెటిజిన్లు చెప్పుకుంటున్నారు. అది కొంత వరకూ వాస్తవమే. ఎందుకంటే.. రెండు కథలూ రైతుకు సంబంధించినవే. హీరో విలాసవంతమైన ఉద్యోగాన్నీ, జీవితాన్నీ వదులుకుని పొలం బాట పట్టడం రెండు కథల నేపథ్యం. అందుకే శ్రీకారం సినిమా కాపీ అనే వాదన వినిపించింది.
అయితే నిజానికి.. శ్రీకారం కాదు. మహర్షినే కాపీ సినిమా అంటున్నారు ఇంకొంతమంది. ఎందుకంటే.. 2016 లో శ్రీకారం అనే ఓ షార్ట్ ఫిల్మ్స్ వచ్చింది. ఆ సినిమా ఆధారంగానే.. శ్రీకారం అనే సినిమా తీశారు. శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ వచ్చాకే మహర్షి వచ్చింది. కాబట్టి.. ఓ రకంగా.. మహర్షికి కూడా... శ్రీకారమే స్ఫూర్తి అనుకోవాలి. ఓ షార్ట్ ఫిల్మ్ చూసి సినిమా అవకాశం ఇవ్వడం చాలా సహజంగా జరిగే విషయం. కానీ.. అదే షార్ట్ ఫిల్మ్‌ని సినిమాగా తీయాలనుకోవడం నిజంగా.. కొత్త సంగతి. ఆ విచిత్రం... శ్రీకారంతోనే జరిగింది.