సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలకు శ్రీరెడ్డి కౌంటర్స్ ఇస్తూ తనదైన శైలిలో రెచ్చిపోతోంది. అయితే నిజంగానే శ్రీరెడ్డి బాలయ్యకు సపోర్ట్ చేస్తుందా.? కానే కాదు మెగా ఫ్యామిలీ మీద ఆమెకున్న కసి తీర్చుకుంటోందిలా. ఎవరిని టార్గెట్ చేస్తే తనకు పబ్లిసిటీ బాగా వస్తుందో శ్రీరెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలియదనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు, ప్రాక్టికల్‌గా అది నిరూపితమైంది కూడా.
అయితే లేటెస్టుగా బాలయ్యను వెనకేసుకొస్తూ, నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇస్తున్న శ్రీరెడ్డి ఏం సాధిస్తుంది. నిజానికి శ్రీరెడ్డి ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించాల్సి ఉంది. ఈ బయోపిక్‌ని తొలుత టేకప్ చేసిన తేజనే పిలిచి మరీ శ్రీరెడ్డికి ఛాన్సిచ్చాడు. కానీ బాలయ్యే ఆ అవకాశాన్ని అపేశాడు. అయితే ఆ తర్వాత శ్రీరెడ్డితో పాటు, తేజ కూడా బయటికి వచ్చేశాడు అది వేరే విషయం. కాకుంటే ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం అనేది నిజంగానే శ్రీరెడ్డికి పెద్ద అవమానం.
అయితే ఇప్పుడు తాజాగా శ్రీరెడ్డి నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్స్ ఇస్తుండడం చూసి బాలయ్య ఫ్యాన్స్ అమెకు నిజంగానే బాలయ్యపై అభిమానం ఉందనుకుంటే పొరపాటే. సోషల్ మీడియా ఉంది కదా అని ఏదో ఒక టాపిక్ పట్టుకుని స్పందించడం ఓ అలవాటుగా పెట్టుకుంది శ్రీరెడ్డి. ముఖ్యంగా మెగా ప్యామిలీని కెలకడంలో ముందుంటోంది. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీకి యాంటీగా బాలయ్యపై అభిమానం కురిపిస్తున్నట్లుగా శ్రీరెడ్డి చేస్తున్న ఈ ఓవరాక్షన్ పట్టించుకునేదెవ్వరు..?