ఇస్మార్ట్‌ సైన్‌: వామ్మో పూరీ చాలా చేశాడే!

మరిన్ని వార్తలు

బీచ్‌ సాంగ్స్‌ తెరకెక్కించడంలో పూరీ తర్వాతే ఇంకెవరైనా అని చెప్పుకోకుండా ఉండలేం. 'ఇడియట్‌'లో హీరోయిన్‌ రక్షితతో బీచ్‌ ఒడ్డున చేయించిన ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా ఇసుకలో హీరోని కప్పెట్టేసి మరీ హీరోయిన్‌తో హాట్‌ హాట్‌గా అందాలారబోయించేసిన ఘనత మరి పూరీకి కాక ఇంకెవరికి దక్కుతుంది చెప్పండి. అంతేనా.. గల గల పారుతున్న గోదారిలా.. అన్నా, 'టెంపర్‌'లో ఎన్టీఆర్‌ - కాజల్‌తో చేయించిన రొమాన్స్‌ చూసినా, 'బిజినెస్‌మెన్‌'.. ఇలా ఒక్కటేమిటి.. అందుకే బీచ్‌ సాంగ్స్‌లో పూరీ స్టైలే వేరు.

 

వాటన్నింటినీ తలదన్నేలా ఉంది 'ఇస్మార్ట్‌ శంకర్‌'లోని తాజా బీచ్‌ సాంగ్‌. 'ఉండిపో.. ఉండిపో..' అంటూ భాస్కరభట్ల రాసిన లిరిక్స్‌కి పూరీ తెరకెక్కించిన వైనం సో హాట్‌ అంటే చిన్నమాటే. చూసి తనివి తీరాల్సిందే. జస్ట్‌ శాంపిల్‌కే ఫుల్‌ మీల్స్‌ పెట్టేసినంత సంతృప్తి పరిచేశాడు పూరీ. నిధి అగర్వాల్‌ - రామ్‌ మధ్య కెమిస్ట్రీని ఆ రేంజ్‌లో పండించేశాడు. ఒక మెలోడీ సాంగ్‌ని ఇంత రొమాంటిక్‌గా చూపించొచ్చా? అని ఆశ్చర్యం కలిగించేలా ఉందీ సాంగ్‌లోని స్టిల్స్‌.

 

లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. స్టిల్స్‌ మత్తెక్కిస్తున్నాయి. ఇక వ్యూస్‌ పోటెత్తడమే ఆలస్యం. పక్కా రికార్డు వ్యూస్‌ దక్కించుకోకుండా ఈ సాంగ్‌ ఉండదని గ్యారంటీగా చెప్పేయొచ్చు. మొదట్నుంచీ అంచనాలు పెంచుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి ఈ సాంగ్‌తో ఆ అంచనాలు మరీ భారీతనం సంతరించుకున్నాయంటే అతిశయోక్తి కాదేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS