మూడో గదిలో తమన్నా అలా చేసిందా?

By iQlikMovies - June 29, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో 'రాజుగారి గది 3' ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. రాజుగారి గది నుండి తమన్నా తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమా డైరెక్టర్‌ అయిన ఓంకార్‌ తనకు ముందు చెప్పిన స్క్రిప్ట్‌కీ, రెగ్యులర్‌ షూట్‌లో జరుగుతున్న స్క్రిప్టుకీ సంబంధం లేదట.

 

రెగ్యులర్‌ స్క్రిప్టు తనకు అంత సంతృప్తికరంగా లేనందున మిల్కీ బ్యూటీ ఈ ప్రాజెక్ట్‌కి గుడ్‌బై చెప్పేసిందట.. అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గాలి వార్తలు ఎంత తొందరగా స్ప్రెడ్‌ అయిపోతాయో అందరికీ తెలిసిందే. వీటిని ఆదిలోనే ఆపకుంటే, వెళ్లి వెళ్లి కొంపలు తగలెట్టేస్తాయి. ఈ ప్రచారంలో నిజముందో లేదో తెలియాలంటే, మిల్కీ బ్యూటీ నుండి కానీ, చిత్ర యూనిట్‌ నుండి కానీ, వీలైనంత తొందరగా రెస్పాన్స్‌ రావాల్సిందే. మరోవైపు ఇటీవలే తమన్నా బాలీవుడ్‌లో ఓ బంపర్‌ ఛాన్స్‌ కొట్టింది.

 

నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో ఓ సినిమాకి తమన్నా కమిట్‌ అయ్యింది. ఒకవేళ ఆ సినిమా డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కోసం, ఓంకార్‌ సినిమాని వద్దనుకుందా.? అయినా కమిట్మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ తమన్నా, అలా చేసే అవకాశమే లేదనేది కొందరి వాదన. ఏమో ఏది ఏమైనా రాజుగారి మూడో గదిలో ఏం జరగునుందో ఇంకా తెలియకుండానే, ఈ తరహా నెగిటివ్‌ ప్రచారం తెరపైకి రావడం ఆశ్చర్యకరం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS