'సాహో'లో జాక్వెలైన్‌ 'స్పెషల్‌' హాట్‌ ట్రీట్.

మరిన్ని వార్తలు

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కూడా సౌత్‌ ఎంట్రీ ఇచ్చేసిందండోయ్‌. ఎప్పుడు? ఎలా? ఎవరితో? అనుకుంటున్నారా? ఇంకెవరితో, ఆమె స్థాయికి తగ్గ నటుడు బాహుబలి ప్రబాస్‌తోనే. అవునండీ, నిజమే.. 'సాహో'లో జాక్వెలైన్‌ ఐటెం సాంగ్‌లో నటించి షాకిచ్చింది. ఇంతవరకూ 'సాహో' కోసం బాలీవుడ్‌ నుండి హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌తో సహా చాలా మంది ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, జాక్వెలైన్‌ సమాచారం మాత్రం లేటెస్ట్‌గా రివీల్‌ అయ్యింది.

 

జాక్వెలైన్‌తో ప్రబాస్‌ రొమాంటిక్‌ స్టెప్పులేస్తున్న ఈ సాంగ్‌ 'సాహో'కి ఖచ్చితంగా ప్లస్‌ అవుతుందనడం అతిశయోక్తి కాదేమో. క్లాస్‌ విజువల్స్‌తో, అందాల తార జాక్వెలైన్‌తో కలిపి పలువురు అందగత్తెలు ఒకరికి ఒకరు మేమేం తక్కువ కాదంటూ అందాలారేస్తుంటే, క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా 'సాహో'ని అభిమానించేయడం ఖాయం. ఆ రేంజ్‌లో 'బ్యాడ్‌ బోయ్‌' అంటూ సాగే ఈ సాంగ్‌ని చిత్రీకరించారు. లేటెస్ట్‌గా విడుదల చేసిన ఈ వీడియో సాంగ్‌ ఇప్పుడు యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌ అయిపోయింది. లైకుల మీద లైకులు, లక్షల దిశగా వ్యూస్‌ దూసుకెళ్తున్నాయి. యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీగా తెరకెక్కించిన 'సాహో'కి పాటలతో పని లేదని మొదట్లో భావించారట.

 

కానీ, మాస్‌ని ఎట్రాక్ట్‌ చేయాలంటే, పాటలు తప్పవని భావించిన సుజిత్‌ అండ్‌ టీమ్‌ మూడు పాటల్ని కుదించారట. రెండు పాటల్ని హీరోయిన్‌పైనా, ఒక పాట జాక్వెలైన్‌పై చిత్రీకరించారు. ఆల్రెడీ శ్రద్ధా - ప్రబాస్‌ జోడీలోని రెండు సాంగ్‌ వీడియోలు చూసేశాం. వాటన్నింటినీ తలదన్నేలా జాక్వెలైన్‌ 'బ్యాడ్‌ బోయ్‌' సాంగ్‌ ఉండడంతో, 'సాహో'పై అంచనాలు పదింతలైపోయాయి. ఈ సాంగ్‌లో జాక్వెలైన్‌ ఒంటి విరుపులు, బోల్డ్‌ అప్పియరెన్స్‌ అస్సలు మామూలుగా లేదండోయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS