కాంట్రవర్సి కి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారిన బిగ్ రియాలిటీ షో 'బిగ్ బాస్' లో వాదనలు గొడవలు సహజమే కానీ మరీ హౌస్ లోనే సూసైడ్ ఆటెంప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి ? అంత అవసరం ఎవరికి వచ్చింది ? అనుకుంటున్నారా ? ఔను హౌస్ మేట్స్ అంతా అవాయిడ్ చేయడం తో...ఒక కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసింది..కాకపోతే ఇది జరిగింది తమిళ్ బిగ్ బాస్ షో లో. మునపటి లాగె ఈసారి కూడా కమల్ హాసన్ హోస్ట్ గా...ఆసక్తికరమైన కంటెస్టెంట్స్ తో తమిళ్ బిగ్ బాస్ 3వ సీజన్ జోరుగా ప్రసారమౌతోంది.
నా ఆటోగ్రాఫ్ లాంటి అద్భుతమైన చిత్రాలు అందించిన చేరన్, తమిళ నటి వనిత విజయ్ కుమార్, శ్రీలంక న్యూస్ రీడర్ లోస్లియా, టీవీ ఆర్టిస్టు కెవిన్, లేడీ కమెడియన్ 'మధుమిత' మరియు ఇతర సెలెబ్రిటీలు తమిళ బిగ్ బాస్ ఫాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హౌస్ లో మధుమితకు ఇతర హౌస్ మేట్స్ తో వాగ్వాదాలు విబేధాలు ఎక్కువయ్యి కొంచం కటువుగా ప్రవర్తించింది..బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ కూడా తనను అందరి హౌస్ మేట్స్ తో మాట్లాడి సర్దుకోమని చెప్పారు కానీ తను మాత్రం ఒక చేరన్ మరియు కొత్తగా హౌస్ లోకి ఎంటర్ అయిన 'కస్తూరి' తో మాత్రమే మాట్లాడింది.
తన తీరు మార్చుకోకుండా హౌస్ మేట్స్ తో మళ్ళి వాదనలకు దిగింది దానికి తోడు ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో ఉండడంతో మణికట్టు కోసుకుని 'సూసైడ్ ఆటెంప్ట్' కూడా చేసుకుంది.తన ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్ మరియు యాజమాన్యం మధుమిత ను హౌస్ నుండి బయటకు పంపించేశారు. ఈ ఎలిమినేషన్ తో ఒక గొడవ వదిలింది అని కొందరు బిగ్ బాస్ ఫాన్స్ అనుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం హోస్ట్ కమల్ హాసన్..తనను సీక్రెట్ రూమ్ లోకి పంపి 'రీ-ఎంట్రీ' కి మరో అవకాశం ఇస్తాడని ఆశిస్తున్నారు. ఇంతకీ ఈ డ్రామా కు ముగింపు ఏంటో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.