ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ కరోనా బారీన పడి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రాజశేఖర్ పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని చెప్పుకున్నారు. వీటిపై ఇప్పుడు జీవిత స్పందించారు. తాజా ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
``రాజశేఖర్ గారి ఆరోగ్యం బాగానే వుంది. నిజానికి ఆయన చాలా సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డారు. వైద్యులు కంగారు పడ్డారు. మేం బాగా భయపడిపోయాం. డాక్టర్ కృష్ణ అండ్ టీమ్ ఆయన్ని అన్ని విధాలా సంరక్షించి, వైద్యం అందించింది. ఇప్పుడు రాజశేఖర్ గారు గండం నుంచి గట్టెక్కారు. కృత్రిమ శ్వాస అవసరం లేకుండానే ఆక్సిజన్ అందుతోంది. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు`` అని చెప్పుకొచ్చారు. సో.. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కుదుట పడినట్టే. ఆయన అభిమానులు ఇక నిశ్చింతగా ఉండొచ్చు.
#Jeevitha about #Rajasekhar health condition.
— Suresh Kondi (@V6_Suresh) November 4, 2020
He is recovering from illness.
She requested everyone to not to spread false news. pic.twitter.com/JNsMzDfk9h