జాన్వీ కపూర్‌ ఒప్పుకోలేదట.!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్‌ అయిన 'వర్మ' కోసం హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ని సంప్రదించారట. కానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు జాన్వీ ఒప్పుకోలేదట. జాన్వీకపూర్‌ నో చెప్పడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ షాకయ్యిందట. నిన్న మొన్నటి దాకా మలయాళ ముద్దుగుమ్మ రష్మికా పేరు ప్రస్థావించారు. అయితే అది కుదరకపోవడంతో జాన్వీతో సంప్రదింపులు చేశారట. 

 

బాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనూహ్యంగా ఆగిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరమైంది. ముఖ్యంగా హీరోయిన్‌ విషయం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. తమిళంలో బాల ప్రముఖ దర్శకుడు. మంచి క్రియేటివిటీ ఉన్న దర్శకుడు. ఆయన విషయంలో ఇలా జరగడంతో తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అందులోనూ ధృవ్‌ కొత్త హీరో. 

 

ధృవ్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకోవడం లేదు అని బాల ఇచ్చిన వివరణ మరింత ప్రకంపనలకు దారి తీసింది. ఇలాంటి టీమ్‌తో వర్క్‌ చేయడం ఎవరికైనా కష్టమే అనే భావనకొచ్చేశారు పలువురు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు. ఇదిలా ఉంటే, అసలింతకీ దర్శకుడెవరో తెలియని సినిమాకి హీరోయిన్‌ కోసం ప్రయత్నించడమేంటీ అని మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS