మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె నిహారిక పెళ్లి విషయమై ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య సోషల్ మీడియాలో పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయిన మెగా బ్రదర్ ఈ సారి నిహారిక పెళ్లి విషయమై ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అబ్బాయి మంచివాడైతే చాలు, క్యాస్ట్‌తో ఏ సంబంధం లేదు అని నాగబాబు అన్నారు.
తన కోరిక మేరకు సినిమాల్లో నటించేందుకు అవకాశమిచ్చాం. ఆ కోరిక తీర్చుకుంటోంది నిహారిక. ఇక పెళ్లి చేసే టైమొచ్చింది. సో వచ్చే ఏడాది మంచి సంబంధం కుదిరితే నిహారికకు పెళ్లి చేస్తామని నాగబాబు ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ఇకపోతే నిహారిక ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. 'సూర్యకాంతం' టైటిల్‌తో వస్తున్న సినిమా ఇటీవల టీజర్ విడుదలైంది.
ఈ టీజర్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాతో నిహారిక ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శ్రియ ప్రధాన పాత్రలో హీరోయిన్ సెంట్రిక్ మూవీగా రూపొందుతోన్న ఓ సినిమాలో నిహారిక కీలక పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు మరికొన్ని మంచి స్టోరీలను నిహారిక పరిశీలిస్తోందట. ఒకవేళ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందేమో నిహారికకు చూడాలి మరి.