బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా 'ఎన్టీఆర్' చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తామని తేజ సినిమా ప్రారంభోత్సవంలో చెప్పారు. అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే ఓ మహాప్రస్థానం.
అలాంటిది దసరా అంటే ఇంకెంతో దూరం లేదు. ఇంత తక్కువ టైంలో ఆ మహా ప్రస్థానాన్ని తెరకెక్కించి, విడుదల చేయడమనేది సాధ్యపడే విషయమేనా.? చాలా పెద్ద స్టోరీ. ఇంచుమించు ఆరు చిత్రాల కథ ఇది. అలాంటిది ఇంత తక్కువ టైంలో తీయడం ఎలా? ఇదే తేజ సందిగ్ధం. అయితే సంక్రాంతికి ఈ సినిమా కోసం బాలయ్య స్లాట్ బుక్ చేశారు. ఆ విషయాన్ని ఆయన గతంలోనే వెల్లడించారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి కాదు, దసరాకే సినిమా విడుదల అంటున్నాడు దర్శకుడు తేజ.
అంతేకాదు ఇంకా ఈ సినిమాకి కథ పూర్తిగా ఫైనల్ కాలేదుట. కథ చాలా బాగా వచ్చినా, ఆరు సినిమాల కథని, ఒక్క సినిమాగా మార్చడమంటే మళ్ళీ దానికి టైమ్ పడుతుంది కదా! ఆయన జీవితంలోని ప్రతీ అంశమూ ఓ ముఖ్యమైన ఘట్టమే. అలాంటిది అందులోని ముఖ్య ఘట్టాలైన, సినీ, రాజకీయ ఘట్టాల్లోని ముఖ్య అంశాలను తెరపై చూపించనున్నారట. అలాంటిది సినిమాలో చూపించాల్సిన ఆ ముఖ్య ఘట్టాలను ఎంచుకోవడానికే బోలెడంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఏది ఏమైనా 2019 ఎలక్షన్స్‌లోగా ఈ సినిమాని విడుదల చేయాలి. అయితే సంక్రాంతికి విడుదల చేసినా, అది ఎలక్షన్స్‌కి ముందే అవుతుంది కదా. ఒకవేళ తేజ పొరపాటుగా దసరాకి రిలీజ్ అన్నారో ఏమో. బయోపిక్ అంటే మాటలు కాదు. ఆ భయం అసలే దర్శకుడు తేజలో స్పష్టంగా కనిపించింది. ఇంతకీ సినిమా తేజ అన్నట్టు దసరాకే విడుదలవుతుందా? బాలయ్య చెప్పినట్టు సంక్రాంతికే వస్తుందా? వేచి చూడాలిక.