అదే జ‌రిగితే నిజంగా అద్భుత‌మే అనుకోవాలి..

By iQlikMovies - October 22, 2018 - 13:42 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా న‌టిస్తున్నాడ‌న్న‌ది ఆ వార్త‌ల సారాంశం. ఇప్ప‌టికే హేమా హేమీలైన స్టార్లు ఈ సినిమాలో పాలు పంచుకుంటున్నారు. ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు ఈ బ‌యోపిక్‌లో పొందుప‌రుస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అడుగుపెట్టాడంటే... అది నిజంగా అద్భుత‌మే అనుకోవాలి.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా- అని ఇదివ‌ర‌కు చాలా సార్లు ఎన్టీఆర్ చెప్పాడు. ఈమ‌ధ్య నంద‌మూరి బాల‌కృష్ణ - ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న అర‌మ‌రిక‌లు కూడా మెల్ల మెల్ల‌గా తొల‌గిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో జూనియర్ క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని నంద‌మూరి ఫ్యాన్స్ ఓ అభిప్రాయానికి వ‌చ్చేశారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా జ‌రిగిపోయిందని, ఎన్టీఆర్ సెట్లో జూనియ‌ర్ అడుగుపెట్టేశాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

మ‌రికొంత‌మంది అయితే.. షూటింగ్ ఇంకా అవ్వ‌లేద‌ని, త్వ‌ర‌లోనే ఎన్టీఆర్‌పై కొన్ని స‌న్నివేశాలు తీస్తార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ వార్త నంద‌మూరి అభిమానుల్లో ఆనందాన్ని ఇచ్చేదే.  ఇది పుకారుగా మిగిలిపోతుందా, ఎన్టీఆర్ - బాల‌య్య‌లు క‌ల‌సి ఆ పుకారుని నిజం చేస్తారా అన్న‌ది కాల‌మే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS