'అరవింద సమేత వీర రాఘవుడి' ఎమోషనల్‌ స్పీచ్‌.!

By iQlikMovies - September 28, 2018 - 18:20 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అరవింద సమేత..' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్‌ ఉన్న లాస్ట్‌ సాంగ్‌ని పూర్తి తాజాగా పూర్తి చేశారు. జానీ మాస్టర్‌ నృత్య సారధ్యంలో ఈ పాటను లేటెస్టుగా పూర్తి చేశారు. ఇక ప్రమోషన్స్‌ వేగవంతం చేయనున్నారు. అందులో భాగంగా అక్టోబర్‌ 2 మంగళవారం 'అరవింద సమేత..' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ ఫంక్షన్‌ చాలా ఎమోషనల్‌గా ఉండనుంది. ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ మరణానంతరం ఎన్టీఆర్‌ నుండి వస్తున్న సినిమా ఇది. ఈ విషాద సంఘటన కారణంగా ఎన్టీఆర్‌ అసలు ఈ సినిమాని పూర్తి చేయగలడా? అనే అనుమానాలొచ్చాయి. కానీ దర్శక, నిర్మాతలకు తన కారణంగా నష్టం కలగకూడదనే భావనతో కొండంత బాధని గుండెల్లోనే దాచుకుని ఎన్టీఆర్‌ సినిమా పూర్తి చేశాడు. ఎన్టీఆర్‌ డెడికేషన్‌కి అంతా ఆశ్యర్యపోయారు. ఈ కారణంగానే ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన ఆడియో ఫంక్షన్‌ని రద్దు చేశారు. 

ఈ విషాద సమయంలో ఫంక్షన్‌ చేయడం సబబు కాదని చిత్ర యూనిట్‌ భావించి డైరెక్ట్‌గా ఆడియోని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇక ఇప్పుడు జరగబోయే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ మోస్ట్‌ ఎమోషనల్‌గా మాట్లాడనున్నాడట. 

వీర రాఘవుడు ఏం మాట్లాడతాడా? అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS