అప్పుడెప్పుడో 'అమ్మాయితో అబ్బాయి' సినిమాలో నటించిన బ్యూటీ పాలక్ లల్వానీ. తాజాగా 'జువ్వ' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ముద్దుగుమ్మ అప్పుడే పెద్ద పెద్ద ఆలోచనలు చేసేస్తోంది. నార్మల్ గ్లామరస్ యాక్ట్రెస్ అనిపించుకోవాలని లేదట ఈ ముద్దుగుమ్మకి. డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకోవాలన్న ఉద్దేశ్యంతోనే హీరోయిన్గా తెరంగేట్రం చేశానంటోంది. అయితే ఆదిలోనే ఆలాంటి పాత్రలకు పిలిచి అవకాశమివ్వడానికి మన టాలీవుడ్ ఏమంత ఖాళీగా లేదు కదా.
అందుకే మొదట నటనలో తానేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తానంటోందీ బ్యూటీ. అనుష్కలాంటి బరువైన పాత్రల్లో నటించాలని ఉందంటోంది.ఇప్పటికే తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన మరో చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందట. తమిళంలో ఓ సినిమాలో నటిస్తోందట. అయితే తెలుగులో పాతుకుపోవాలన్నదే ఈ ముద్దుగుమ్మ లక్ష్యమంటోంది. 'జువ్వ' సినిమాతో తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో చూపిస్తానంటోంది. గ్లామర్‌తో పాటు, అభినయంతోనూ ఆకట్టుకుంటాననీ పాలక్ లల్వానీ చెబుతోంది.
కొత్త కొత్త కాన్సెప్ట్లపై అమ్మడు దృష్టి పెడుతోందట. డిఫరెంట్ కథాంశాలతో వచ్చే సినిమాలను అస్సలు వదులుకోనంటోంది. స్టార్ హీరోయిన్ అయిపోవాలనే పెద్ద కోరిక లేదు కానీ, యాక్టింగ్‌లో తనదైన ప్రత్యేకతను చూపించి, ప్రత్యేక గుర్తింపు పొందాలన్నదే ఈ ముద్దుగుమ్మ కోరికట. తెలుగుతో పాటు తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది పాలక్ లల్వానీ.