'రెమో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో శివకార్తికేయన్. ఇప్పుడీ యంగ్ హీరో మన టాలీవుడ్ యంగ్ హీరో రూటును ఫాలో అవుతన్నట్లుగా అనిపిస్తోంది. ఈ మధ్యనే హీరో నాని నిర్మాతగా కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీ అయిన 'అ! చిత్రాన్ని తెరకెక్కించి, టాలీవుడ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు అదే తరహాలో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా నిర్మాతగా మారబోతున్నాడు.
నిర్మాతగా మారేందుకు రీజన్ ఏంటి.. అంటే నాని మాటలను పోలినట్లే మాట్లాడుతున్నాడు. ఈ చిత్ర పరిశ్రమ నాకు ఎన్నో ఇచ్చింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. అందుకు ప్రతిగా తానేం చేసి రుణం తీర్చుకోవాలని చాలా సార్లు ఆలోచించాను. సరిగ్గా అదే టైంలో తన ప్రాణ స్నేహితుడు అరుణ్ చెప్పిన స్టోరీ ఒకటి తనని ఇన్‌స్పైర్ చేసేలా ఉండడంతో ఇదే సరైన సమయం అనుకుని, తన కష్ట సుఖాల్లో వెన్నంటి ఉన్న స్నేహితుని కోసం నిర్మాతగా మారాలనుకున్నానంటూ.
యంగ్ హీరో శివ కార్తికేయన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన స్నేహితుల్లో ఒకరైన అరుణ్ రాజా కామరాజ్‌లోని టాలెంట్‌ని గుర్తించి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాకి శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుని జీవిత నేపధ్యం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయాడట శివకార్తికేయన్. అందుకే ఈ చిత్రంతోనే తాను నిర్మాతగా మారి, స్నేహితునికి సాయం చేయాలనుకున్నాననీ చెప్పారు.
తాజాగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందట. హీరోగా నటిస్తూనే, నిర్మాతగా కూడా ఇకపై మంచి చిత్రాలను రూపొందించే యోచనలో యంగ్ హీరో శివకార్తికేయన్ ఉన్నట్లు తెలుస్తోంది.