తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది ముద్దుగుమ్మ జ్యోతిక. చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోస్ పక్కన నటించి, హిట్లు అందుకుంది. తమిళ హీరో సూర్యని పెళ్లి చేసుకుని చాలా కాలం ఇంటికే పరిమితమైన జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చి, బిజీగా గడుపుతోంది. '36 వయదినిలే' చిత్రం ద్వారా జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చింది. తరువాత 'మగళీర్ మట్టుం' చిత్రంలో నటించి ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత హోమ్‌లీ పాత్రలతో ఆకట్టుకున్న జ్యోతిక ఇప్పుడు కొంచెం జోరు పెంచింది.
'నాచ్చియార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కి వస్తోన్న రెస్పాన్స్ మామూలుగా లేదు. జీవీ ప్రకాశ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జ్యోతిక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫుల్ పవర్‌తో కనిపిస్తోంది. టీజర్ చివర్లో జ్యోతిక చెబుతున్న డైలాగ్‌పై కొంత చర్చ జరుగుతోంది. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ డైలాగ్ అసభ్యకరంగా ఉందనీ, ఆలాంటి డైలాగ్‌ని జ్యోతిక చేత డైరెక్టర్ ఎలా చెప్పించాడంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ సినిమాలో జ్యోతిక మాత్రం క్యూట్‌గా కనిపిస్తూనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధడ్‌ధడ్‌లాడిస్తోంది. జ్యోతికని ఈ పాత్రలో చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తనలోని ఈ డిఫరెంట్ యాంగిల్‌ని ఇంతవరకూ చూడలేదు ఆడియన్స్. సో చాలా కొత్తగా కనిపిస్తోంది. హీరో జీవీ ప్రకాష్‌కీ ఈ సినిమా వెరీ వెరీ స్పెషల్ కానుంది. కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనీ కోలీవుడ్ వర్గాలు అభినందిస్తున్నాయి. ఇళయరాజా బాణీలు అందించిన ఈ సినిమాకి బాలా దర్శకత్వం వహిస్తున్నారు.