'ముద్దు' ఆ ఒక్కటీ అడగొద్దు.!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమా అంతగా సక్సెస్‌ అవడానికీ, సంచలనం కావడానికి కారణం ఈ సినిమా నిండా పుష్కలంగా నిండి ఉన్న ముద్దు సీన్లే. అంతకు ముందెన్నడూ తెలుగు సినిమాలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాలో ముద్దు సీన్లు కుక్కి కుక్కి పెట్టేశారు. సినిమా ప్రమోషనే ఆ ముద్దుసీన్లతో చేశారు. ఇక సినిమా సంచలన విజయం అందుకోవడానికి అలా అవి ప్రధాన కారణమయ్యాయి. ఇకపోతే ఈ సినిమాని తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మాదిరి ఈ భాషల్లో 'అర్జున్‌రెడ్డి'ని ఆ ముద్దుసీన్లతో ప్రమోట్‌ చేయకపోవడం విశేషం. 

 

నిజానికి ముద్దు సీన్లు టాలీవుడ్‌కి కొత్త కానీ, బాలీవుడ్‌లో పెద్దగా లెక్కే కాదు. అక్కడ చాలా సహజం. అందుకేనేమో తెలుగులో ప్రమోషన్స్‌కి ఆ సీన్లను అంతగా వాడేసుకున్నారు కానీ, బాలీవుడ్‌లో ఆ ఛాన్స్‌ని ఛాన్స్‌గా తీసుకోలేదు. ఎలాగూ బాలీవుడ్‌లో ఆ డోస్‌ ఇంకా ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. ఇక ఇదే విషయాన్ని హిందీ అర్జున్‌రెడ్డి 'కబీర్‌సింగ్‌'లో హీరోయిన్‌గా నటిస్తున్న కైరా అద్వానీని అడిగితే 'ఆ ఒక్కటీ అడగొద్దు' అని తప్పించుకుంటోంది.

 

'ముద్దు సీన్లు అనేవి సినిమాలో ఓ భాగం. అయితే అవి ఈ సినిమాలో ఎక్కువా, తక్కువా అంటే నేను చెప్పలేను.. ఒరిజినల్‌ అర్జున్‌రెడ్డి ఓ అద్భుతం.. దాన్ని మ్యాచ్‌ చేయడానికి మా వంతు కృషి చేశాం.. అని కైరా చెప్పుకొచ్చింది. ఇటీవల విడుదలైన 'కబీర్‌ సింగ్‌' టీజర్‌లో హీరో ఆటిట్యూడ్‌ని చూపించారు. కానీ మసాలా సీన్లేమీ మిక్స్‌ చేయలేదు. ఒరిజినల్‌ రూపొందించిన సందీప్‌ రెడ్డి వంగానే ఈ రీమేక్‌నీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS