తెలుగులో 'అర్జున్‌రెడ్డి'గా తన ఆటిట్యూడ్‌తో నెవర్ బిఫోర్ పర్‌ఫామెన్స్ ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాని హిందీతో పాటు, తమిళంలోనూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే హిందీ రీమేక్ చేస్తున్నది మాత్రం ఒరిజినల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగానే కావడంతో ఎలాంటి సమస్యా లేదు. ఇకపోతే లేటెస్ట్‌గా విడుదలైన హిందీ 'అర్జున్‌రెడ్డి', 'కబీర్‌సింగ్' టీజర్ బాలీవుడ్ జనాన్ని విశేషంగా ఆకర్షించడంతో అక్కడ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని.
దాంతో చిత్ర యూనిట్ ఖుషీ ఖుషీగా పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో సందీప్ రెడ్డి వంగాతో హీరో షాహిద్‌కపూర్, హీరోయిన్ కియారా అద్వానీ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, తెలుగులో 'అర్జున్‌రెడ్డి' బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న షాలినీ పాండే, ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయింది. బాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాల్లో నటించి టాలీవుడ్‌కొచ్చి 'భరత్' బ్యూటీగా పిచ్చ క్రేజ్ సంపాదించింది కియారా అద్వానీ. మళ్లీ బాలీవుడ్‌లో 'కబీర్‌సింగ్'తో బంపర్ ఛాన్స్ కొట్టేసింది.
ఈ ఛాన్స్ అలాంటిలాంటి ఛాన్స్ కాదు కదా. తెలుగులో ప్రస్తుతం కన్‌ఫామ్డ్ ప్రాజెక్టులేమీ లేకపోయినా, బాలీవుడ్‌లో 'కబీర్‌సింగ్'తో పాటు వరుస సినిమాల్లో నటిస్తోంది. సో కియారా ఇక బాలీవుడ్‌లో ఫిక్స్ అయిపోయేలానే కనిపిస్తోంది. అయితే తనకింత క్రేజ్ రావడానికి కారణమైన టాలీవుడ్‌ని వదిలిపెట్టేది లేదనీ, టాలీవుడ్ నుండి ఏ అవకాశమొచ్చినా వదులుకోననీ కియారా చెబుతోంది. కానీ వన్స్ బాలీవుడ్‌లో బిజీ అయితే సౌత్‌కి రావడం కూసింత కష్టమే మరి.చూడాలి మరి రెండింటినీ ఈ బ్యూటీ ఎలా మ్యానేజ్ చేస్తుందో.