ముద్దుగుమ్మ కాజల్ తెలుగులో డైరెక్టర్ తేజ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. కాజల్‌కి తెలుగులో మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కాజల్‌కి మంచి హిట్‌ని అందించింది. అందుకే టాలీవుడ్‌లో డైరెక్టర్ తేజ తనకు గురువుగారు అని కాజల్ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకి తేజ డైరెక్షన్‌లో మళ్లీ సినిమా చేస్తోంది ముద్దుగుమ్మ కాజల్. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న కాజల్, తేజ కోసమే ఈ సినిమా ఒప్పుకుంది. రానా హీరోగా తెరకెక్కుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కాజల్ నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లేటెస్ట్‌గా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో కాజల్ స్పీచ్ మెయిన్ అట్రాక్షన్ అయ్యింది. ఎందుకంటే కాజల్ ఇంతవరకూ ఎక్కడా తెలుగులో మాట్లాడలేదు. వాస్తవానికి తొలి సినిమాకే తేజ, కాజల్‌కి తెలుగులో మాట్లాడడం నేర్పించాడు. కానీ ఆ తర్వాత అమ్మడు తెలుగులో మాట్లాడడం మర్చిపోయింది. ఒకవేళ గుర్తున్నా ఎక్కడా మాట్లాడదు. అలాంటిది 'నేనే రాజు నేనే మంతి' సినిమా ఆడియో ఫంక్షన్‌లో తన గురువుగారు తేజ కోసం తెలుగులో ఓ కవిత రాసి తీసుకొచ్చింది. తెలుగులో మాట్లాడింది. ఈ రకంగా కాజల్ తన గురువుగారి రుణం తీర్చుకుంది కాబోలు. కొత్తగా వచ్చిన ముద్దుగుమ్మలు నివేదా థామస్, సాయి పల్లవి తదితరులు చక్కగా తెలుగు మాట్లాడేస్తున్నారు. వారి పాత్రలకి వారే డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు. కానీ కాజల్ అలా కాదు. కనీసం తెలుగులో ఎక్కడా మాట్లాడనే మాట్లాడదు సరికదా ఇక డబ్బింగ్ సంగతి సరేసరి.