సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిషకు తమిణళంలో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో త్రిషకు ఎనిమిదికి పైగా సినిమాలున్నాయి. వాటిలో ఎక్కువ లేడీ ఓరియెండెట్ మూవీసే కావడం విశేషం. అయితే ప్రస్తుతం త్రిష ఏం చేస్తోందో తెలుసా? కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. ఈ వయసులో అదీ ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకి కిక్ బాక్సింగ్ అవసరం ఏం వచ్చిందంటారా? వచ్చిందండీ, ఓ సినిమాలో తన పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మ కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటోందట. అనుష్క, నయనతార, శృతిహాసన్ వంటి ముద్దుగుమ్మలు ఇప్పటికే పాత్రల అవసరాల నిమిత్తం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. ఇప్పుడు త్రిష కూడా అలాగే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. కెరీర్ స్టార్ట్ చేశాక ఇన్నాళ్లకి ఇలాంటి సాహసాలు చేయాల్సిన అవసరం వచ్చింది త్రిషకి. అంటే ఆ సినిమా ఎంత ప్రాధాన్యత ఉన్నదో అర్ధమవుతోంది. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో త్రిష నటిస్తోందని తెలియవస్తోంది. తమిళంలో ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నా కానీ, సీనియర్ హీరోయిన్స్‌దే హవా అక్కడ. అలాగే నయనతార, త్రిష కోలీవుడ్‌ని ఏలుతున్నారు. గతంలో 'నాయకి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది త్రిష. తెలుగులో త్రిష కెరీర్‌లో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మంచి అవకాశమొస్తే తెలుగులో నటించడానికి సిద్ధమే అంటోంది ముద్దుగుమ్మ త్రిష.