చందమామ 'క్వీన్‌'గా ఎందుకు మారిందంటే.!

By iQlikMovies - December 25, 2018 - 18:23 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన సినిమా 'క్వీన్‌'. ఆ సినిమాతోనే కంగనా కెరీర్‌ టర్న్‌ అయ్యింది. స్టార్‌ హీరోయిన్‌గా కంగనా బాలీవుడ్‌లో సెటిలైపోయింది ఈ సినిమాతోనే. ఇక ఈ సినిమాని దక్షిణాదిలోని నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‌లో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఓ సాధారణ అమ్మాయి కథే ఈ క్వీన్‌. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా గురించి కాజల్‌ తన మనసులోని మాటల్ని అభిమానులతో పంచుకుంది.

సమాజంలో క్వీన్‌లాంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు. మా ఈ సినిమా అలాంటి చాలా మంది అమ్మాయిల్లో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపాలనే ఉద్దేశ్యంతోనే ఈ కథలో నటించేందుకు ఒప్పుకున్నాను. అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని కాజల్‌ తెలిపింది. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో ఓ సీన్‌ విషయమై కాజల్‌ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమా చూస్తే, ఆ సీన్‌లో ఎందుకు నటించాల్సి వచ్చిందో అర్ధమవుతుంది అంటోంది కాజల్‌. అలాగే కాజల్‌ తదుపరి 'ఇండియన్‌ 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌తో తొలిసారి ఈ సినిమాలో జత కడుతోంది చందమామ కాజల్‌ అగర్వాల్‌. గతంలో వచ్చిన 'ఇండియన్‌' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని శంకర్‌ తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS