హీరోయిన్‌గా పరిచయమై దశాబ్ధ కాలం దాటేసినా, చందమామ అందంలో వీసమెత్తైనా తరుగుదల కనిపించదు. వయసుతో పాటే అందం పెరుగుతోంది అంటే, అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చందమామనే తీసుకోవాలి. తాజాగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ పిక్స్ చూస్తే, చందమామ అందానికి ఆమెకి ఆమె సాటి. ఆమెకి ఆమే పోటీ అనాలేమో.
డిజైనర్ మోడ్రన్ టైట్ ఫిట్‌లో చందమామ అందాలు నిండుగా కనువిందు చేస్తున్నాయి. తరగని అందం కనుకే, ఇప్పటికీ యంగ్ హీరోస్ సైతం ఏరి కోరి చందమామతో జోడీ కడుతున్నారు. ప్రస్తుతం చందమామ 'ప్యారిస్ ప్యారిస్' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ 'క్వీన్'కి తమిళ రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ 'ప్యారిస్ ప్యారిస్'. ఇక తెలుగులో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'సీత' సినిమాలో నటిస్తోంది.
ALSO SEE : Kajal Aggarwal Latest Photoshoot