మిల్కీబ్యూటీ.. ఏంటమ్మా ఈ లొల్లి.?

మరిన్ని వార్తలు

లేటెస్ట్‌గా 'ఎఫ్‌ 2' సినిమాతో హిట్‌ కొట్టి ఫుల్‌ జోష్‌ మీదుంది మిల్కీబ్యూటీ తమన్నా. చేతిలో మరో రెండు ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి. వాటిలో 'దటీజ్‌ మహాలక్ష్మి' విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలో. ఇదిలా ఉంటే, తమన్నా స్క్రీన్‌పై గ్లామర్‌గా కనిపించడం వరకూ ఓకే కానీ, హద్దులు మీరిన గ్లామర్‌ని ప్రదర్శించలేదింతవరకూ. ఇక ప్రస్తుతం లిప్‌లాక్స్‌ ట్రెండ్‌ బాగా నడుస్తున్న తరుణంలో మిల్కీబ్యూటీని లిప్‌లాక్‌ చేస్తే ఎవరితో చేస్తావని అడిగితే బాలీవుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌ అని ఠక్కున సమాధానమిచ్చేసింది. 

 

అదేంటో ఆ ఇష్టం. టాలీవుడ్‌లో ఇంతమంది హీరోలుంటే బాలీవుడ్‌ హీరో హృతిక్‌ పేరు చెప్పిందేంటో. కానీ మరి డేట్‌కెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళుతుందో తెలుసా.? క్రికెట్‌ హీరో విరాట్‌ కోహ్లీతోనట. అరే తమన్నా టేస్ట్‌ భలేగుందే అనుకోవాల్సి వస్తోంది కదా. ఇదిలా ఉంటే, తమన్నా - విరాట్‌ కోహ్లీ మధ్య అఫైర్‌ ఉందంటూ ఆ మధ్య గాసిప్స్‌ హల్‌చల్‌ చేశాయి. 

 

అయితే అలాంటిదేం లేదనీ, గతంలో విరాట్‌తో కలిసి ఓ యాడ్‌ ఫిలింలో నటించాననీ ఆ టైంలోనే ఈ గాసిప్స్‌ పుట్టాయనీ తమన్నా చెప్పింది. కానీ ఆ తర్వాత విరాట్‌ తనను కలవలేదనీ, దాంతో డేట్‌కి వెళ్లడం కుదరలేదనీ, అందుకే ఛాన్సొస్తే ఇప్పుడు విరాట్‌తో కలిసి డేట్‌కి వెళతానని చెప్పి నవ్వేసింది తమన్నా. ఇంతకీ మిల్కీ బ్యూటీ ఏం చెప్పిందో మీకైనా అర్ధమైందా.? ఆ నవ్వు వెనక దాగిన అర్ధమేంటో. తీరిగ్గా కూర్చొని అర్ధం చేసుకోండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS