మంచు హీరోకి 'NO’ చెప్పిన కాజల్ అగర్వాల్

మరిన్ని వార్తలు

గాయత్రి చిత్రం ప్రోమోస్ చూస్తుంటే హీరోయిన్ శ్రియా శరణ్ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటికి బలం చేకూరుస్తూ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలో మోహన్ బాబు సైతం శ్రియా నటన ఈ చిత్రంలో ఒక హైలైట్ గా నిలిచిపోనుంది అని పొగడ్తలతో ముంచేశాడు.

ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం ముందుగా ఒక మంచి పాపులారిటీ ఉన్న నటిని అడగగా ఆమె ఆ ఆఫర్ ని  తిరస్కరించడం జరిగింది. ఇంతకీ ఆ నటి మరెవరో కాదు కాజల్ అగర్వాల్. ఈ పాత్ర కోసం దర్శక-నిర్మాతలు కొంతమంది పేర్లని పరిశీలించగా అందులో కాజల్ అగర్వాల్ పేరు రావడం అందుకు ఆమెని సంప్రదించడం జరిగింది.

అయితే ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించడంతో వారు నటి శ్రియాని ఆ పాత్ర కోసం అడగగా, అందుకు ఆమె అంగీకరించడం జరిగిపోయింది.

ఇప్పటికీ కాజల్ అగర్వాల్ ఈ ఆఫర్ కి ఎందుకు ‘NO’ చెప్పింది అనే విషయం మనకి తెలియదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS