'టెంపర్‌' రీమేక్‌లో కాజల్‌ ఇంకోస్సారి?

మరిన్ని వార్తలు

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ 'టెంపర్‌' సినిమాలో అదరగొట్టేసింది. ఈ సినిమాలో ఆమె నటన ఆమె గ్లామర్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ ఇంకోసారి 'టెంపర్‌' సినిమాలోనే నటించబోతోందిట. అయితే అది తెలుగు సినిమా కాదు, బాలీవుడ్‌ సినిమా. 'టెంపర్‌' సినిమాని బాలీవుడ్‌లో రోహిత్‌ శెట్టి రీమేక్‌ చేయబోతున్నాడు. ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా నటిస్తాడట. ఒరిజినల్‌లో చేసిన కాజల్‌ అయితేనే ఈ సినిమాకి హీరోయిన్‌గా బాగుంటుందని రోహిత్‌ శెట్టి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలియవస్తోంది. బాలీవుడ్‌లో కాజల్‌ ఇదివరకే కొన్ని సినిమాల్లో నటించింది. 'సింగం' సినిమా రీమేక్‌లో నటించి పెద్ద హిట్‌ కొట్టేసింది. అజయ్‌ దేవగన్‌ ఆ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సెంటిమెంట్‌ కూడా వర్కవుట్‌ అయ్యేలానే ఉంది. అందుకే చిత్ర యూనిట్‌ ఈ సినిమాకి హీరోయిన్‌గా కాజల్‌కే ఓటేస్తోంది. సో ఆ రకంగా 'టెంపర్‌' రీమేక్‌ కోసం బాలీవుడ్‌లో మరో హిట్‌ సినిమాకి ఛాన్స్‌ కొట్టేసింది ముద్దుగుమ్మ సమంత. ఈ మధ్యే తెలుగులో మెగాస్టార్‌తో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటించి మెగా హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న మెగా భామగా సెటిలైపోయింది. తమిళంలో కాజల్‌ నటించిన సినిమా తెలుగులో 'ఎంతవరకూ ప్రేమంట' పేరుతో రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవా హీరోగా నటించాడు ఈ సినిమాలో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS