కాజల్‌ని టెన్షన్‌ పెట్టేస్తోన్న డ్రీమ్‌ ప్రాజెక్ట్‌!

మరిన్ని వార్తలు

చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. అందుకు కారణం ఆమె టేకప్‌ చేసిన, చేస్తున్న ప్రాజెక్టులే. మొన్నీ మధ్యనే 'సీత' అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే అంచనాల్ని అందుకోలేకపోయింది మన 'సీత'. కానీ కాజల్‌ డీలా పడాల్సిన పరిస్థితి లేదు. ఆమె చేతిలో మరిన్ని బిగ్‌ ప్రాజెక్టులున్నాయి. ఓ వైపు గ్లామర్‌ పరంగా ఆమెకున్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. కాజల్‌ ఫేడ్‌ అయిపోయిందే అనుకోవడానికి ఏమాత్రం లేదు. మేకప్‌ లేకుండా ఫోటోలు పోస్ట్‌ చేసినా, అహో, ఒహో అంటూ ఆ ఫోటోలు కూడా వైరల్‌ అయిపోయాయి. ఇక ఆ వెంటనే, తనను అంతలా అభిమానిస్తున్న అభిమానుల కోసం మళ్లీ గ్లామరస్‌ పిక్స్‌ పోస్ట్‌ చేసి, మసాలా అద్దేసింది.

 

ఇక చేస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే, కాజల్‌ నటించిన 'ప్యారిస్‌ ప్యారిస్‌' 'క్వీన్‌ తమిళ రీమేక్‌ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో శర్వానంద్‌తో కాజల్‌ ఓ సినిమాతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో 'కోమలి' అనే బిగ్‌ బడ్జెట్‌ మూవీలో కాజల్‌ నటిస్తోంది. జయం రవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక అసలు సిసలు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకోదగ్గది విశ్వనటుడు కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందుతోన్న 'ఇండియన్‌ 2' చిత్రం.

 

ఈ చిత్రంలో తనకి ఛాన్స్‌ దక్కినందుకు కాజల్‌ చాలా ఎగ్జైట్‌ అయ్యింది. కమల్‌తో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ ఆనందాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది కూడా. అయితే, ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌ కారణంగా కాజల్‌ కాస్త ఒత్తిడికి గురవుతోందట. సినిమా ఆగిపోయిందట అనే వార్తలన్నీ రూమర్సేనని కాజల్‌ కొట్టి పారేస్తోంది. కానీ, ఈ సినిమాపై నెగిటివ్‌గా రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంది. ఈ తరుణంలో త్వరలోనే 'ఇండియన్‌ 2' షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లుగా కాజల్‌ నుండి చిన్న హింట్‌ అందిందట. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS