'మహర్షి' విడుదలైంది. అంచనాలని అందుకుందా లేదా.? అనే విషయం పక్కన పెడితే, తర్వాత రానున్న సినిమాలకు 'మహర్షి' టెన్షన్ తీరిపోయినట్లే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఓ మోస్తరు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆడియన్స్ కోరుకున్న కంటెన్ట్ కరెక్ట్‌గా ఉంటే, చిన్ని సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు, రాబోయే సినిమాలు బాగానే వర్కవుట్ అవుతాయనడం నిస్సందేహం.
ఎందుకంటే ఇది హాలీడేస్ సీజన్. సో తర్వాత రాబోయే సినిమాలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. ఇక ఈ వరుసలో మొదటగా రిలీజ్‌కి కన్‌ఫామ్ అయ్యి ఉన్న సినిమా అల్లు శిరీష్ నటించిన 'ఏబీసీడీ'. నో కన్‌ఫ్యూజన్. అల్లు వారబ్బాయ్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'ఏబీసీడీ - అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ'గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలూ ఈ సినిమాపై ఆశక్తిని పెంచేలా ఉన్నాయి. హాట్ సమ్మర్‌లో మోర్ ఫన్ గ్యారంటీ అనే రేంజ్‌లో ఈ సినిమా ప్రచార చిత్రాలుండడంతో మెగా ఫ్యాన్సే కాదు, ఆడియన్స్ అంతా ఈ సినిమాకి పైసా వసూల్ రేంజ్‌లో ఎంజాయ్ చేయొచ్చు అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ వరసలో కాజల్ నటించిన 'సీత' కూడా ఉంది. ఈ నెల 24న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఆశక్తికరంగానే ఉన్నాయి. సీత, రాముడు, రావణుడు ఈ కాన్సెప్ట్‌లో మోడ్రన్ రామాయణంగా ఈ స్టోరీని తీర్చి దిద్దాడు డైరెక్టర్ తేజ.
అయితే సీతను మాత్రం నెగిటివ్ షేడ్స్‌లో చూపించి డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సో 'సీత' కూడా తక్కువేం కాదు, తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేస్తానంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటించగా, సోనూ సూద్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు.