టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రబాస్‌కి అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల దొరికింది. ఎందుకంటారా.? ఇంకెందుకండీ.. పెళ్లి చేసుకుందుకే. ఇంతకీ ఎవరా అగ్గిపిల్ల అనుకుంటున్నారా.? ఇంకెవరు చందమామ కాజల్ అగర్వాల్. అవునండీ మీరు విన్నది నిజమే. ప్రబాస్‌ని కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందట. ఏంటీ ట్విస్ట్ అనుకుంటున్నారా.? మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహిస్తున్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' ప్రోగ్రాంలో తాజాగా కాజల్ అగర్వాల్ పాల్గొంది. ఈ నేపథ్యంలో ఎవర్ని పెళ్లి చేసుకుంటావ్.? ఎవర్ని చంపేస్తావ్.? ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉంటావ్.? అని అడిగితే, ప్రబాస్‌ని పెళ్లి చేసుకుంటాను.
రామ్ చరణ్‌ని చంపేస్తాను. ఎన్టీఆర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటాను.. అని కాజల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ ప్రోగ్రాంలో మంచు లక్ష్మి అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్‌కి స్టార్స్ కూడా ఇదిగో ఇలాగే అంతకు మించి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఓన్లీ. నాట్ ఏ ఫేక్ట్ అనుకోవాలి మరి. ఇకపోతే, ప్రబాస్‌తో కాజల్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్', 'డార్లింగ్' చిత్రాల్లో నటించింది. రామ్‌చరణ్‌తో కెరీర్ బెస్ట్ మూవీ 'మగధీర'లో నటించింది. ఎన్టీఆర్‌తో నటించిన 'బృందావనం' కూడా సూపర్ హిట్ మూవీనే. అందుకే ఈ ముగ్గురు స్టార్ హీరోస్‌ని మంచు లక్ష్మి టార్గెట్ చేసి, కాజల్‌తో ఈ నిజం కాని నిజాల్ని ప్రశ్నలుగా అడిగి, ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిందన్న మాట.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది.