బాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ కాజోల్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. మహారాష్ట్రలో గోమాంసాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, పలు రాష్ట్రాల్లో ఈ విషయంపై వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం గో మాంస విక్రమాయలను పూర్తిగా నిషేధించింది. కాదని ఒకవేళ ఎవరైనా గోమాంసాన్ని విక్రయిస్తే అందుకు తగిన శిక్షలు కూడా విధించింది. ఇలాంటి దశ్చర్యకు పాల్పడేవారికి పదివేల రూపాయల జరిమానా, ఐదేళ్ల పాటు జైలు శిక్ష వంటి కఠిన శిక్షనే విధించనున్నారు. అయితే బాలీవుడ్ భామ కాజోల్, తన స్నేహితుడు రయాన్ స్టీఫెన్‌తో కలసి బీఫ్ వండుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాంతో నెటిజన్లు కాజల్‌పై కామెంట్లతో విరుచుకు పడ్డారు. దాంతో పాపం కాజోల్ స్పందించక తప్పలేదు. నా ఫ్రెండ్ వండుతున్నది బీప్ కాదు, దున్నపోతు మాంసం అని రెస్పాండ్ అయ్యింది. ఇది ఇల్లీగల్ కాదు, లీగల్‌గా మార్కెట్లో దొరుకుతుంది అని ఆమె ట్వీట్ చేసింది. అంతేకాదు అమ్మడు అంతకన్నా ఎక్కువగానే స్పందించింది. నేనే కాదు మహారాష్ట్రలో ఇంకెవరైనా గో మాంసాన్ని వండుతున్నట్లుగా కనిపిస్తే వాళ్ల చేతులు నరికేయాలని ఓ వీడియో ద్వారా చెప్పింది. ఇంత గట్టిగా చెప్పిందంటే కాజోల్ చెప్పింది నిజమేనేమో, ఆమె బీఫ్‌నే వండుతోంది కాబోలు అనుకుని నెటిజన్లు శాంతించారు. అదండీ సంగతి!